గడప గడపకు పోలీస్‌ పహారా

ABN , First Publish Date - 2022-05-14T06:08:36+05:30 IST

భారీ పోలీసు పహారా నడుమ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు.

గడప గడపకు పోలీస్‌ పహారా
దళిత సంఘాలనేతలను ముందుస్తు అరెస్టు చేసిన దృశ్యం

ముందస్తుగా భారీ బందోబస్తు

బుక్కరాయసముద్రం, మే13:  భారీ పోలీసు పహారా నడుమ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏమైన ఇబ్బందులు, సమస్యలు సృష్టిస్తారనే అనుమానంతో టీడీపీ నేతలను పోలీసులు స్టేషనకు పిలిపించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని చెదళ్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డితో పాటు వైసీపీ నేతలు హాజరయ్యారు. కార్యక్రమానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం.  ఎమ్మెల్యే వెంటే అంత మంది పోలీసులు ఉంటే ప్రజలు ఏం సమస్యలు చెబుతారని  పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ముందస్తు అరెస్టులు : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మావతి వస్తున్న నేపథ్యం లో సమస్యలపై నిలదీస్తారనే అనుమానంతో దళిత సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్‌ నేత చిన్న ఆంజనేయులు, చంద్రతో పాటు మరో ముగ్గురిని శుక్రవారం  బుక్కరాయసముద్రం పోలీసులు అరెస్టు చేసి అనంతపురం నాల్గోపట్టణ పోలీసుస్టేషనకు తరలించారు. టీడీపీ నాయకులను కూడా  హెచ్చరించి వదలేసినట్లు తెలిసింది. 




Read more