-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Let develop the food industry-NGTS-AndhraPradesh
-
‘ఆహార’ పరిశ్రమలను అభివృద్ధి చేద్దాం
ABN , First Publish Date - 2022-05-14T06:12:20+05:30 IST
జిల్లాలో ఆహార సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి చూపిద్దాం అంటూ ఉద్యావనశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్ సూచించారు.
పుట్టపర్తి, మే 13 : జిల్లాలో ఆహార సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి చూపిద్దాం అంటూ ఉద్యావనశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం ద్వారా ఔత్సాహికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం ఏపీ ఫుడ్ ప్రాససింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు, కొత్తవారికి వ్యక్తిగత రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలను, కొత్తగా స్థాపించే పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం సబ్సిడీతో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ, ప్రాజెక్టు డైరక్టర్ నరసమ్మ, ఈడీ పద ్మలత, వైపీడీ రమణప్ప, ఏపీఎంలు, ఏసీఎంలు పాల్గొన్నారు.

