ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘గడప గడప’లో జనం నిలదీత

ABN, First Publish Date - 2022-05-14T05:38:41+05:30

వైసీపీ చేపట్టిన ‘గడప గడపకు మ న ప్రభుత్వం’ కార్యక్రమాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులకు శుక్రవా రం కూడా నిలదీతలు, నిరసనల సెగ తగిలింది.

మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి సమస్యలు విన్నవిస్తున్న కాలనీ వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇళ్లు, పింఛన్లు అందలేదంటూ ఆవేదన


మడకశిర టౌన, మే 13: వైసీపీ చేపట్టిన ‘గడప గడపకు మ న ప్రభుత్వం’ కార్యక్రమాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులకు శుక్రవా రం కూడా నిలదీతలు, నిరసనల సెగ తగిలింది.  మడకశిర పట్టణంలోని 9, 10వ వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, రాష్ట్ర ఒ క్కలిగ కార్పొరేషన చైర్‌పర్సన డాక్టర్‌ నళిని పర్యటించారు. ఈసం దర్భంగా స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఉన్నా పింఛన అందడం లేదని, ఇళ్లు మంజూరు చేయలేదని పలువురు కాలనీ వాసులు నిలదీశారు. కాలనీల్లో పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఎత్తుప్రాంతం కావడంతో కాలనీలో నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాలు ఏర్పా టు చేయాలని మహిళలు కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కాలనీలో నెలకొన్న ప్రతి సమస్య పరిష్కారానికి చర్య లు తీసుకొంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన లక్ష్మినరసమ్మ, కమిషనర్‌ లక్ష్మిదేవి, ఎం పీపీ కవిత, జడ్పీటీసీ సుజాతమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


 పెనుకొండ రూరల్‌: మండలంలోని నాగలూరులో ఎమ్మెల్యే శంకర్‌నారాయణ శుక్రవారం గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా వెళ్లి ప్రభుత్వ పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొంతమంది రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవ ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఓ మహిళ కరపత్రాలు పంచుతు న్న క్రమంలో తీసుకోవడానికి తిరస్కరించింది. అనంతరం ఎమ్మె ల్యే విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫ లాలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లకా లంలో నియోజకవర్గాల్లో ఎన్ని చెరువులకు నీరందించారో చెప్పాలంటూ విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్‌ నాగరాజు, ఏఓ రాకే్‌షనాయక్‌, మండల కన్వీనర్‌ నాగలూరుబాబు, మున్సిపల్‌ చైర్మన ఉమర్‌ఫారూక్‌ పాల్గొన్నారు.  


హిందూపురం టౌన: కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని పట్టణంలోని 32వ వార్డు ప్రజలు ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ను కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భా గంగా శుక్రవారం ఆయన వార్డు పరిధిలోని ఆబాద్‌పేటలో పర్య టించారు. ఈసందర్భంగా స్థానిక మహిళలు ఇళ్ల వద్ద డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన జబీవుల్లా, రేష్మాబాను, గోపీకృష్ణ పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!