జగన పాలనంతా బాదుడే: టీడీపీ

ABN , First Publish Date - 2022-05-14T05:37:24+05:30 IST

నెరవేర్చని హామీలు గుప్పించి అధికారంలోకి వ చ్చిన సీఎం జగన... అన్ని రకాల ధరలు పెంచి రాష్ట్ర ప్రజలను బాదుతున్నారని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.

జగన పాలనంతా బాదుడే: టీడీపీ
కొవ్వొత్తులు, లాంతర్లతో టీడీపీ శ్రేణుల నిరసన ప్రదర్శన

రొళ్ల, మే 13: నెరవేర్చని హామీలు గుప్పించి అధికారంలోకి వ చ్చిన సీఎం జగన... అన్ని రకాల ధరలు పెంచి రాష్ట్ర ప్రజలను బాదుతున్నారని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. శుక్రవారం స్థానికంగా టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బా దుడు’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు, లాంతర్లను చేతపట్టి నాలుగు రోడ్ల కూడలి నుంచి ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇం టింటా ప్రజలకు వివరించారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందజే శారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యుత చా ర్జీలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచి పేదల పై పెనుభారం మోపారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు విద్యుత చార్జీలు పెంచిందన్నారు. ఈ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. పెంచిన విద్యుత, ఆర్టీసీ చా ర్జీలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమం లో టీడీపీ మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, అగళి టీడీపీ జడ్పీటీసీ ఉ మేష్‌, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గురుమూర్తి, తెలుగు యు వత నియోజకవర్గ అధ్యక్షులు బాలకృష్ణ, మనోహర్‌ పాల్గొన్నారు.  


Read more