-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Hike from Chalakur BK-NGTS-AndhraPradesh
-
చాలకూరు నుంచి పాదయాత్ర: బీకే
ABN , First Publish Date - 2022-05-14T05:55:31+05:30 IST
చాలకూరు నుంచి బ్రహ్మసముద్రం వరకు చెరువులకు హంద్రీనీవా నీరు ఇచ్చేందుకు తమ పార్టీ హయాంలో నిధులు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం పనులు ఆపేసిందని, దీనిని నిరసిస్తూ పాదయాత్ర చేస్తామని టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.
రొద్దం, మే 13: చాలకూరు నుంచి బ్రహ్మసముద్రం వరకు చెరువులకు హంద్రీనీవా నీరు ఇచ్చేందుకు తమ పార్టీ హయాంలో నిధులు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం పనులు ఆపేసిందని, దీనిని నిరసిస్తూ పాదయాత్ర చేస్తామని టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆర్.మరువపల్లిలోని తన స్వగృహంలో పెనుకొండ నియోజకవర్గ ఐటీడీపీ ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ చాలకూరు నుంచి బ్రహ్మసముద్రం వరకు పాదయాత్ర చేపడతామన్నారు. కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హెచఆర్‌డీ మాజీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నాయుడు, పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, అధికార ప్రతినిధి నరసింహులు పాల్గొన్నారు.

