పెన్నహోబిలానికి ఉత్సవమూర్తులు
ABN, First Publish Date - 2022-05-14T05:56:07+05:30
పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామివారి ఉత్సవమూర్తులు శుక్రవారం ఆమిద్యాల నుంచి పెన్నహోబిలం క్షేత్రానికి చేరాయి.
ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు
ఉరవకొండ, మే 13: పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామివారి ఉత్సవమూర్తులు శుక్రవారం ఆమిద్యాల నుంచి పెన్నహోబిలం క్షేత్రానికి చేరాయి. ఆమిద్యాలలోని స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఊరేగింపుగా పెన్నహోబిలానికి తోడ్కొనివచ్చారు. ఆలయ అధికారి విజయ్‌కుమార్, ప్రధాన అర్చకుడు ద్వారనాథాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన అశోక్ పెన్నహోబిలంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు.