ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ముదిగుబ్బలో కలెక్టర్‌ విస్తృత తనిఖీలు

ABN, First Publish Date - 2022-05-14T06:10:35+05:30

మండలంలో జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ శుక్రవారం విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు. ఉపాధి ప నులు, ఇంటర్మీడియేట్‌ పరీక్షా కేంద్రం, సచి వాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముదిగుబ్బ, మే 13: మండలంలో జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ శుక్రవారం విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు. ఉపాధి ప నులు, ఇంటర్మీడియేట్‌ పరీక్షా కేంద్రం, సచి వాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. మొదట ఆయన ద్విచక్రవాహనంలో  తెల్లకొండలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. సమస్యలపై కూలీలతో ఆరాతీశారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ... ఉపాధి పనులపై కూలీలకు అవగాహన కల్పించాలని,  కూలి సకాలంలో చెల్లిస్తామని అన్నారు. మస్టర్లను తనిఖీ చేశారు. రైతు భరోసా-2 కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం సచివాలయం-1 తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా నాణ్యమైన సేవలు అం దించాలని సిబ్బందిని ఆదేశించారు. అర్హులం దరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. సచివాలయంలో రిజిస్ట్రర్‌, బయోమెట్రిక్‌, అటెండెన్సను తనిఖీ చేశారు.  రామస్వా మినాయక్‌తండాలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ భవనాన్ని పరిశీలించారు.  స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ బసంతకుమార్‌ తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ వరప్రసాద్‌రావు, తహసీల్దార్‌ కరుణాకర్‌, ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఈఓఆర్‌డీ నసీమా, ఏపీఓ రవి, ఏఓ నరసింహులు ఉన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!