కనులపండువగా బండిశూల రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-14T05:45:07+05:30 IST

మండలంలోని రామరాజుపల్లి గ్రామంలో వెలసిన ముత్యాలయ్య, సుంకులమ్మ బండిశూల రథం పెద్దవడుగూరు మండలంలోని గుత్తి అనంతపురం నుంచి రామరాజుపల్లికి గురువారం రాత్రి చేరుకుంది.

కనులపండువగా బండిశూల రథోత్సవం

పామిడి, మే13 : మండలంలోని రామరాజుపల్లి గ్రామంలో వెలసిన ముత్యాలయ్య, సుంకులమ్మ బండిశూల రథం పెద్దవడుగూరు మండలంలోని గుత్తి అనంతపురం నుంచి రామరాజుపల్లికి గురువారం రాత్రి చేరుకుంది. తిరిగి శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తిఅనంతపురం వద్ద వున్న గుడి వద్దకు ఏడు కాండ్ల ఎద్దులు బండిశూల రథాన్ని లాగాయి. రామరాజుపల్లి, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి, గుత్తిఅనంతపురము గ్రామకమిటీ పెద్దలు భక్తులు బండిశూల రథాన్ని ఎక్కకుండా, కాండ్లు (ఎద్దులు) బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో పామిడి, రూరల్‌ సీఐలు ఈరన్న, రామకృష్ణ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంలో విద్యుత్‌ ప్రమాద సంఘటనలు చోటుచేసుకోకుండా ట్రాన్స్‌కో ఏఈ మధుసూదన్‌రావు తమ సిబ్బందితో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.



Read more