18న డీఆర్సీ సమావేశం
ABN, First Publish Date - 2022-05-14T05:53:54+05:30
డీఆర్సీ సమావేశం ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బసంతకుమార్ తెలిపారు.
పుట్టపర్తి, మే 13: డీఆర్సీ సమావేశం ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బసంతకుమార్ తెలిపారు. కొత్త జిల్లాలో నిర్వహించనున్న మొట్టమొదటి సమావేశానికి అన్నివిధాలా సిద్ధం కావాలంటూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్సీ సమావేశానికి ఆయాశాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. రెండు రోజుల్లో టీపీఓ కార్యాలయంలో ప్రగతి నివేదిక అందజేయాలంటూ ఆదేశించారు. డీఆర్సీ మీటింగ్‌కు జిల్లా ఇనచార్జి మంత్రి జయరాం, ఎంపీ, ఎమ్మెల్యేలు జడ్పీ చైర్‌పర్సన తదితరులు హాజరవుతారన్నారు.