రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిన్న వీరభద్రుడికి జైలు, జరిమానా
ABN, First Publish Date - 2022-05-04T03:48:00+05:30
పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన్న వీరభద్రుడికి జైలు శిక్షతో పాటు జరిమానా పడింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు బీపీఈడీ కో..
అమరావతి: పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన్న వీరభద్రుడికి జైలు శిక్షతో పాటు జరిమానా పడింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు బీపీఈడీ కోర్సును అభ్యసించేందుకు అనుమతించాలని గత ఏడాది మార్చి 8న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఎస్‌జీటీలు హైకోర్టులో ధిక్కరణ వాజ్యం వేశారు. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోలేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో చిన్న వీరభద్రుడిపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో బీపీఈడీ కోర్సును అభ్యసించడానికి అనుమతించకపోవడాన్ని తప్పుపట్టింది. అయితే కోర్టు తీర్పు అమలు చేయడం ఆలస్యం అయినందుకు చిన్న వీరభద్రుడు క్షమాపణ చెప్పినా అంగీకరించలేదు. నిజాయితీగా క్షమాపణలు చెప్పినట్టు లేదని హైకోర్టు భావించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు అవసరమైన డిగ్రీని అభ్యసించేందుకు అవరోదంగా ఉన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మెమోను కూడా రద్దు చేసింది. చిన్న వీరభద్రుడికి నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 2 వేలు జరిమానా విధించింది. న్యాయవాది అభ్యర్ధన మేరకు తీర్పు అమలును రెండు వారాల పాటు నిలుపుదల చేసింది.