4 గంటల్లోనే 6 ఆర్‌యూబీలు!

ABN , First Publish Date - 2022-05-14T09:28:50+05:30 IST

4 గంటల్లోనే 6 ఆర్‌యూబీలు!

4 గంటల్లోనే 6 ఆర్‌యూబీలు!

విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): రోడ్డు అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ల నిర్మాణంలో విజయవాడ రైల్వే డివిజన్‌ రికార్డు సృష్టించింది. నాలుగు గంటల్లోనే ఆరు ఆర్‌యూబీలు నిర్మించి ఔరా.. అనిపించింది. విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో మానవ సహిత లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించేందుకు విజయవాడ రైల్వే డివిజన్‌ ఆరు ఆర్‌యూబీల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ సెక్షన్‌లో కేవలం నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ను బ్లాక్‌ చేసి ఆరు ఆర్‌యూబీలను దిగ్విజయంగా ఏర్పాటు చేసింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఆర్‌సీ బాక్సులను ఆరు చోట్ల ఏకకాలంలో అమర్చడం ద్వారా ఈ ఘనతను సాధించింది. స్వర్ణ చతుర్భుజి మార్గాలలో విజయవాడ-దువ్వాడ సెక్షన్‌ ఒకటి. ఈ మార్గంలో లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్న గుల్లిపాడు-పిఠాపురం, హంసవరం-తుని, తుని-గుల్లిపాడు, ఎలమంచిలి-నర్సింగపల్లి, నర్సీపట్నం-రేగుపాలెం, తుని-గుల్లిపాడుల మధ్య ఆర్‌యూబీలను తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించిన రికార్డు నెలకొల్పింది. 



Read more