-
-
Home » Andhra Pradesh » 256 lakh crore loans to the state NABARD-NGTS-AndhraPradesh
-
రాష్ట్రానికి రూ.2.56లక్షల కోట్ల రుణాలు: నాబార్డు
ABN , First Publish Date - 2022-05-14T09:34:35+05:30 IST
రాష్ట్రానికి రూ.2.56లక్షల కోట్ల రుణాలు: నాబార్డు
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ప్రాధాన్యత రంగాల కింద 2022-23లో రాష్ట్రానికి రూ.2.56లక్షల కోట్ల రుణాలు అందించనున్నట్లు నాబార్డు ప్రకటించింది. 2021-22లో రాష్ట్రాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రైతు రుణాల కింద రూ.39,708కోట్లు అందజేసినట్లు నాబార్డు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 9డీసీసీబీలు, ఆప్కాబ్‌కు మూలధనం పెంపుదల కోసం దీర్ఘకాలిక రుణం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.295కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో రీఫైనాన్స్ కింద రూ.26,283కోట్లు, గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.2,700కోట్లు ప్రత్యేక నిధిగా, వ్యక్తిగత రుణాల కోసం సహకార బ్యాంకులకు ప్రత్యక రీఫైనాన్స్ కింద రూ.666కోట్లు నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యకలాపాలకు రూ.381కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1650.52కోట్లు గ్రామీణ రహదార్లకు రూ.1158.53కోట్లు, రైతుభరోసా కేంద్రాలు, మార్కెటింగ్ సదుపాయాలకు రూ.1495కోట్లు, పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణకు రూ.146కోట్ల నిధులు సమకూర్చినట్లు వివరించారు.

