20 నుంచి ఎస్‌టీఎఫ్ ఐ సభలు

ABN , First Publish Date - 2022-05-14T09:37:13+05:30 IST

20 నుంచి ఎస్‌టీఎఫ్ ఐ సభలు

20 నుంచి ఎస్‌టీఎఫ్ ఐ సభలు

జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీఎ్‌ఫఐ) 8వ జాతీయ మహాసభలు ఈ నెల 20 నుంచి 23 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ సభలకు సంబంధించిన కరపత్రాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న 30ఉపాధ్యాయ సంఘాలు హాజరవుతాయని తెలిపారు. 20వ తేదీన విజయవాడలో టీచర్ల మహార్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. కాగా, సీపీఎస్‌ స్థానంలో పాత పింఛను విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జాతీయ పింఛను సాధన ఉద్యమ నాయకుడు రామాంజనేయ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. 


Read more