వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనా..!?

ABN , First Publish Date - 2021-02-09T19:39:53+05:30 IST

వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనా..!?

హైదరాబాద్ : వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ షర్మిల నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు, ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే షర్మిల పార్టీ పేరు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ వైఎస్సార్‌సీపీ’గా షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.


మార్చిలో పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. ఈలోగా తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే షర్మిల టీమ్‌ ఈసీని అప్రోచ్‌ అయ్యింది. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టిసారిస్తారని.. ఆ తర్వాతే పార్టీపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.  త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర నిర్వహిస్తారని కూడా షర్మిల నిర్వహిస్తారని తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా షర్మిల పార్టీని అన్ని విధాలుగా చూసుకుంటారని సమాచారం. నల్గొండ జిల్లా కార్యకర్తలతో షర్మిల సమావేశం ఇంకా కొనసాగుతోంది. అభిమానులు, కార్యకర్తలు, నేతల నుంచి షర్మిల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

Read more