దామగుండం అడవిని సంరక్షించాలి

ABN , First Publish Date - 2021-02-09T05:56:17+05:30 IST

దామగుండం అడవిని సంరక్షించాలి

దామగుండం అడవిని సంరక్షించాలి

వికారాబాద్‌: దామగుండం అడవిని సంరక్షించాలని పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ తెలిపారు. సోమవారం అతిథి గృహంలో పరిరక్షణ సమితి సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ.. 3వేల ఎకరాల్లోని దామగుండం అటవీ వృక్ష సంపదతో పాటు 150జాతుల వన్య ప్రాణులు, పక్షలు ఉన్నాయన్నారు. ఇక్కడ నేవీ రాడార్‌, జైలు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు.  కార్యక్రమంలో పరిరక్షణ సమితి సభ్యులు సత్యానందస్వామి, సత్యనారాయణ, సాయన్న, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more