రైతులకు ఆలయాలు రైతు వేదికలు : ఎమ్మెల్యే పెద్ది
ABN , First Publish Date - 2021-02-10T04:52:31+05:30 IST
రైతులకు ఆలయాలు రైతు వేదికలు : ఎమ్మెల్యే పెద్ది
నల్లబెల్లి, ఫిబ్రవరి 9: రైతు వేదికలు వారికి ఆలయాల వంటివని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారక్కపేట, ముచ్చింపుల, నల్లబెల్లి, కన్నరావుపేట గ్రామాల్లో రైతు వేదిక భవనాలను జేడీఏ ఉషాదయాల్, రైతు రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ రైతులందరు ఏకదాటిపైకి రావడానికి వేదికలు దోహదపడుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రైతులకు నాయ్యం జరుగుతుందని, రైతుల గురించి మాట్లాడేది ఆయన అని అన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మల్లక్క, సువర్ణ, రాజారాంయాదవ్, నిర్మల, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి మహేశ్, ఆర్డీవో పవన్‌కుమార్, ఏడీఏ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి: సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు దోహదపడుతాయని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. లక్ష్మీపురంలో రైతు వేదికను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ కోమల, సర్పంచ్ సురేశ్, ఏడీఏ శ్రీనివా్‌సరావు, సొసైటీ చైర్మన్‌లు రాజేశ్వర్‌రావు, పైడి, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

