శని అమావాస్య ఉత్సవాలకు ముస్తాబైన పంచగామ శనీశ్వరాలయం

ABN , First Publish Date - 2021-03-13T05:34:23+05:30 IST

శివరాత్రి పర్వదినం అనంతరం రెండో రోజునే శనివారం అమావాస్య రావడంతో పంచగామ శివార్లలో వెలిసిన శనీశ్వర ఆలయానికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ వ్యవస్థాపకులు కాశీనాథ్‌ బాబా పేర్కొన్నారు.

శని అమావాస్య ఉత్సవాలకు ముస్తాబైన పంచగామ శనీశ్వరాలయం

మూడు రాష్ట్రాల నుంచి తరలి రానున్న భక్తులు

నారాయణఖేడ్‌ మార్చి 12: శివరాత్రి పర్వదినం అనంతరం రెండో రోజునే శనివారం అమావాస్య రావడంతో పంచగామ శివార్లలో వెలిసిన శనీశ్వర ఆలయానికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ వ్యవస్థాపకులు కాశీనాథ్‌ బాబా పేర్కొన్నారు. శని అమావాస్య చాలా అరుదుగా వస్తుందని, శనీశ్వరుడికి పూజలు చేస్తే దోష నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకమన్నారు. అందువల్ల ఈనెల 13న ఉదయం 6 నుంచి ఆలయంలో తైలాభిషేకాలు, సాయంత్రం 4 గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు తెలిపారు. శనీశ్వర ఆలయాలు దేశంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్రలోని శనిషిగ్నాపూర్‌, శనిఘాట్‌లో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పంచగామలోనే ఉందన్నారు. అందువల్ల ఆలయానికి శని అమావాస్య రోజున కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు వస్తారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం భోజన వసతి కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.

Read more