జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీ విజయవంతం

ABN , First Publish Date - 2021-02-20T06:06:49+05:30 IST

మెదక్‌ జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీ విజయవంతమైనట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు.

జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీ విజయవంతం
పేట వైద్యశాలలో రికార్డులను తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు



పెద్దశంకరంపేట/అల్లాదుర్గం, ఫిబ్రవరి 19 : మెదక్‌ జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీ విజయవంతమైనట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు. కొవిడ్‌ టీకాను ఏవిధంగా అందిస్తున్నారని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహాలు పెంచుకోవద్దని సూచించారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని, రెండో విడత వ్యాక్సిన్‌ తప్పకుండా వేయించుకోవాలని కోరారు. ఆయన వెంట పేట వైద్య సిబ్బంది భూమయ్య, సంపూర్ణ, రామ్మోహన్‌, వెంకటేశం, అల్లాదుర్గం పీహెచ్‌సీ వైద్యాధికారి దివ్యజ్యోతి, రేడోగు వైద్యాధికారి శ్వేత తదితరులు ఉన్నారు.

Read more