ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి జిల్లా రైతు వేదికలు
ABN, First Publish Date - 2021-01-31T04:34:59+05:30
జిల్లాలో బ్రహ్మాండంగా రైతు వేదికలు నిర్మిం చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కొత్తగూడెం, జనవరి 30: జిల్లాలో బ్రహ్మాండంగా రైతు వేదికలు నిర్మిం చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవం, పాత బస్ డిపో దుర్గా థియేటర్ నుంచి సూపర్ బజార్, రైల్వే అండర్ బ్రిడ్జి, బీఎస్ ఎన్‌ఎల్ కార్యాలయం మీదుగా గోధుమ వాగు వరకు రూ.1.50కోట్లతో నిర్మించనున్న సెంటర్ డివైడర్, పట్టణ ప్రగతి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.... రైతులను సంఘటితంచేసి వ్యవసాయంలో మెళకువలు తెలియజెప్పేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు సుందరంగా తీర్చిదిద్దారని కలెక్టర్ డాక్టర్ ఎంవీ.రెడ్డిని అభినందించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తమది రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కలెక్టర్ డాక్టర్ ఎంవీ. రెడ్డి, అదనపు కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం మునిసిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మీ, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ భూక్యా సోనా, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.