ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2021-02-20T05:47:15+05:30
ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లిలో ఛత్రపతి జయంతి వేడుకల్లో పాల్గొన్న యూత్ సభ్యులు
పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 19: ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఇతర రాజుల నుంచి కాపాడానికి శివాజీ చేసిన విరోచిత పోరాటల గురించి నేమరు వేసుకున్నారు. దేశ సేవలో యువతకు ఆదర్శగా శివాజీ నిలిచారన్నారు. యువ సేన అధ్యక్షుడు శివంగారి సతీస్, రాజేష్, రాధాస్వామి, వంశీరాజ్, శ్రావ ణ్, మహేష్, హరీష్, సంపత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.