ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పాస్‌వర్డ్‌ ప్రొటక్షన్‌తో వాట్సాప్‌ క్లౌడ్‌ బ్యాకప్‌

ABN, First Publish Date - 2021-03-13T05:50:28+05:30

క్లౌడ్‌ బ్యాకప్‌ భద్రతపై కూడా ‘వాట్సాప్‌’ దృష్టిసారించింది. చాట్‌ బ్యాకప్స్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసి పాస్‌వర్డ్‌తో వీటిని మరింత భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

క్లౌడ్‌ బ్యాకప్‌ భద్రతపై కూడా ‘వాట్సాప్‌’ దృష్టిసారించింది. చాట్‌ బ్యాకప్స్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసి పాస్‌వర్డ్‌తో వీటిని మరింత భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీచర్‌తో ఎన్‌క్రిప్ట్‌ చేసిన క్లౌడ్‌ బ్యాకప్‌ను సదురు వాట్సాప్‌ వినియోగదారులు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. ‘వాబేటా ఇన్ఫో’ గత ఏడాదే ఈ విషయాన్ని బైటపెట్టింది. వాట్సాప్‌ కార్యకలాపాలను ఇది ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసి తెలియజేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌లలో ఈ ఫీచర్‌ త్వరలో ప్రత్యక్షం కావచ్చని సమాచారం.


బ్యాకప్‌కి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ కావాలని అనుకుంటే ఫోన్‌ నంబర్‌ కీ అడుగుతుంది. ఆ తరువాత ఎనిమిది క్యారెక్టర్లలో పాస్‌వర్డ్‌ను యూజర్‌ సెట్‌ చేసుకోవచ్చు. యూజర్‌ కావాలనుకున్నప్పుడు క్లౌడ్‌ నుంచి తన వాట్సాప్‌ బ్యాకప్‌ను ఈ పాస్‌వర్డ్‌ సహాయంతో తిరిగి పొందవచ్చు. ఈ పాస్‌వర్డ్‌ను ఫేస్‌బుక్‌తో తాను షేర్‌ చేసుకోవడం లేదని వాట్సాప్‌ చెబుతోంది. ఒకవేళ యూజర్‌ కనక తన పాస్‌వర్డ్‌ను మర్చిపోతే, రిట్రైవ్‌ చేసే అవకాశాలు లేవని, ఫలితంగా క్లౌడ్‌ చాట్స్‌ను కోల్పోవాల్సి వస్తుందని వాట్సప్‌ తెలిపింది. 


వాట్సాప్‌ చాట్స్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయిన విధంగానే చాట్‌ బ్యాకప్స్‌ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే చాట్‌ బ్యాకప్స్‌ ఒకసారి క్లౌడ్‌ సర్వర్లకు వెళితే, వాటి పరిరక్షణ బాధ్యత కూడా వారిదే అవుతుంది. గతంతో సరైన అధికారిక వారెంట్‌తో సదరు మెసేజ్‌లను ప్రొవైడర్లు ఇతరులకు ఇచ్చేవారు. ఇప్పుడు పాస్‌వర్డ్‌తో రక్షణ కల్పిస్తే యూజర్‌ మినహా మరెవ్వరూ పొందే అవకాశం ఉండదు. అయితే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ విషయమై అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!