ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సిగ్నల్‌లోనూ సేమ్‌ ఫీచర్స్‌

ABN, First Publish Date - 2021-01-30T05:30:00+05:30

వాట్సాప్‌ ప్రైవసీ గందరగోళంతో మెసేజ్‌ యాప్‌లు ‘టెలిగ్రామ్‌’, ‘సిగ్నల్‌’ పండగ చేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. నిజానికి మూడూ మెస్సేజింగ్‌ చాట్స్‌ కోసం ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కల్పిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వాట్సాప్‌ ప్రైవసీ గందరగోళంతో మెసేజ్‌ యాప్‌లు ‘టెలిగ్రామ్‌’, ‘సిగ్నల్‌’ పండగ చేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. నిజానికి మూడూ మెస్సేజింగ్‌ చాట్స్‌ కోసం ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే వాట్సాప్‌లో ఉన్న ఎనిమిది పాపులర్‌ ఫీచర్ల లాంటి వాటిని తన వినియోగదారులకూ అందించే పనిలో సిగ్నల్‌ ఉంది. 


కస్టమ్‌ వాల్‌పేపర్స్‌: వాట్సాప్‌ గత ఏడాది కస్టమ్‌ వాల్‌పేపర్లను పరిచయం చేసింది. వేర్వేరు ఛాట్‌లకు అవసరమైన వాల్‌ పేపర్‌ను ఉపయోగించుకునే వీలు కల్పించింది. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ వినియోగదారులకు సిగ్నల్‌ కూడా ఇలాంటి వాల్‌పేపర్స్‌ను అందించనుంది.


అబౌట్‌ స్టేటస్‌: వాట్సాప్‌ ప్రొఫైల్‌ సెక్షన్‌లో అబౌట్‌ స్టేటస్‌ ఉంటుంది. పదకొండు ఆప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి. అవైలబుల్‌, బిజీ, ఎట్‌ స్కూల్‌, ఎట్‌ ద మూవీస్‌, ఎట్‌ వర్క్‌, బ్యాటరీ ఎబౌట్‌ టు డై వంటివి ఉంటాయి. వినియోగదారులు తమ ఛాయిస్‌కు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు సిగ్నల్‌  ‘బయో’ను క్రియేట్‌ చేస్తోంది. స్పీక్‌ ఫ్రీలీ, ఎన్‌క్రిప్టెడ్‌, ఫ్రీ టు చాట్‌, కాఫీ లవర్‌, టేకింగ్‌  ఎ బ్రేక్‌ వంటి ఆప్షన్స్‌ను ఇస్తోంది. 


యానిమేటెడ్‌ స్టిక్కర్స్‌: వినియోగదారులు కమ్యూనికేట్‌ చేసుకునేందుకు యానిమేటెడ్‌ స్టిక్కర్లు వాట్సాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవి బాగా పాపులర్‌. సిగ్నల్‌ కూడా ఇలాంటివే అందించే ప్రయత్నాల్లో ఉంది. 


స్ట్టార్డ్‌ చాట్స్‌: వాట్సాప్‌లో మాదిరిగానే ప్రత్యేకించి ఒక చాట్‌కు స్టార్‌ పెట్టుకునే ఆప్షన్‌ కలిగిస్తోంది.


లో-డేటా మోడ్‌: స్టోరేజ్‌ అండ్‌ డేటా సెక్షన్‌ కింద లో డేటా మోడ్‌ని కాల్స్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ ప్రత్యేకించింది. దీంతో లెస్‌ డేటా కాల్స్‌ను వినియోగదారులు చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాటిదే సిగ్నల్‌ కూడా ఏర్పాటు చేస్తోంది. డేటా యూసేజ్‌ సెక్షన్‌లో లెస్‌ డేటా యూజ్‌ అని ఉంటుంది.


కాంటాక్ట్‌ సజెషన్‌: మోస్ట్‌ ఫ్రీక్వెంట్‌ చాట్స్‌ను చూసే సదుపాయం వాట్సాప్‌లో ఉంది. సరిగ్గా అటువంటిదే సిగ్నల్‌లోనూ కనిపించనుంది. 


డౌన్‌లోడ్‌ ప్రిఫరెన్సెస్‌: వాట్సాప్‌ మాదిరిగానే మీడియా ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా వినియోగదారులు తమ డివైస్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌కు ఉద్దేశించిన ప్లాట్‌ఫామ్స్‌ యథాతథం. నెవ్వర్‌, వైఫై, వైఫై ప్లస్‌ సెల్యులర్‌ను సెలెక్ట్‌ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. 


గ్రూప్‌ కాల్స్‌: ఏకకాలంలో ఎనిమిది మందితో వాట్సాప్‌లో చాట్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ బీటా సమాచారం ప్రకారం సిగ్నల్‌  నుంచి కూడా ఎనిమిది మందితో చాట్‌ చేసుకోవచ్చు. ఇంతకుమునుపు ఇది అయిదుగురికే పరిమితం. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!