ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం.. భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట!

ABN, First Publish Date - 2021-03-13T17:41:58+05:30

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ హయాం నుంచి వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీయులకు బైడెన్​ సర్కార్​ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ హయాం నుంచి వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీయులకు బైడెన్​ సర్కార్​ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వీసాలకు సంబంధించి విదేశీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించనుంది. నాన్-ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలు ముఖ్యంగా హెచ్​-1బీ వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన మూడు ఆదేశాలతో విదేశీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూఎస్​ సిటిజెన్​షిప్ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​)​ స్పష్టం చేసింది.


ఈ మేరకు ఫామ్‌ ఐ-129కి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని ​యూఎస్​సీఐఎస్​​ వెల్లడించింది. ఆ మూడు విధానాలతో ఇబ్బందులు పడుతున్న వారు వాటిపై యూఎస్​సీఐఎస్​కు తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని పేర్కొంది. ఇక బైడెన్ పాలనావిభాగం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రంప్ హయాం నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఉపశమనం లభించిందని చెప్పాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!