పొగడ్తలకు పొంగిపోయి..!

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

ఒకరోజు బాగా ఆకలితో అలమటిస్తున్న ఒక కాకి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దారిపై ఒక బ్రెడ్‌ ముక్క కనిపించింది. దాన్ని తీసుకుని చెట్టు పైకి వెళ్లి కూర్చుంది. ఇక బ్రెడ్‌ తిందాం అనుకుంటూ ఉండగా, అటుగా ఒక నక్క వచ్చింది. అది కూడా బాగా

పొగడ్తలకు పొంగిపోయి..!

ఒకరోజు బాగా ఆకలితో అలమటిస్తున్న ఒక కాకి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దారిపై ఒక బ్రెడ్‌ ముక్క కనిపించింది. దాన్ని తీసుకుని చెట్టు పైకి వెళ్లి కూర్చుంది. ఇక బ్రెడ్‌ తిందాం అనుకుంటూ ఉండగా, అటుగా ఒక నక్క వచ్చింది. అది కూడా బాగా ఆకలితో ఉంది. కాకి నోట్లో బ్రెడ్‌ ముక్కను చూసి, ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని మనసులో అనుకుంది. వెంటనే కాకితో ‘‘నువ్వు ఈ రోజు స్మార్ట్‌గా కనిపిస్తున్నావు. నువ్వు పాటలు కూడా బాగా పాడతావని విన్నాను. నాకోసం ఒకసారి పాడవా?’’ అంది నక్క. ఆ మాటలకు కాకి పొంగిపోయింది.


పాట పాడితే నోట్లో ఉన్న బ్రెడ్‌ ముక్క కిందపడి పోతుందని ఆలోచించింది. తెలివిగా బ్రెడ్‌ను కాలు కింద పెట్టుకుని పాట పాడటం మొదలుపెట్టింది కాకి. అది చూసిన నక్క తన పథకం ఫలించకపోవడంతో మరో ప్లాన్‌ వేసింది. ‘‘ఎంత బాగా పాడుతున్నావు. నువ్వు డ్యాన్స్‌ కూడా బాగా చేస్తావని విన్నాను. ఒకసారి డ్యాన్స్‌ చేయవా?’’ అని అడిగింది నక్క. ఆ మాటలు వినడంతో కాకి మరింత పొంగిపోయింది. కాలు కింద బ్రెడ్‌ ముక్క ఉన్న విషయం మరిచిపోయి ఎగిరింది. దాంతో బ్రెడ్‌ ముక్క కిందపడింది. వెంటనే నక్క దాన్ని అందుకుని తినేసింది. పొగడ్తలకు పొంగిపోయి నోటికందిన ఆహారాన్ని పోగొట్టుకున్నానని కాకి బాధపడింది.

Read more