ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తేనెటీగ గొప్పలు!

ABN, First Publish Date - 2021-02-09T07:49:45+05:30

ఒక చిట్టడవిలో ఒక తేనెటీగ ఉండేది. అది సోమరిపోతు. ఏ పనీ చేసేది కాదు. తానే గొప్పదాన్ని అని, తనకున్న శక్తిసామర్థ్యాలు ఎవరికీ లేవని అనుకునేది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఒక చిట్టడవిలో ఒక తేనెటీగ ఉండేది. అది సోమరిపోతు. ఏ పనీ చేసేది కాదు. తానే గొప్పదాన్ని అని, తనకున్న శక్తిసామర్థ్యాలు ఎవరికీ లేవని అనుకునేది. ఒకరోజు చెట్టుపై కూర్చొని ఉండగా దూరంలో గడ్డిమేస్తున్న ఒక ఎద్దు కనిపించింది. ఆ ఎద్దు ముందు తన గొప్పలు చూపించాలని వెళ్లి దాని కొమ్ముపై వాలింది. 


‘‘మిత్రమా! ఎలా ఉన్నావు?’’ అని ఎద్దును అడిగింది. ఎద్దు ఏమీ మాట్లాడలేదు. ఎద్దుకు తేనెటీగ మాటలు వినిపించలేదు సరికదా. అసలు తన కొమ్ముపై తేనెటీగ వాలిందన్న విషయమే తెలియలేదు. ‘‘నా బరువును నువ్వు ఆపగలవా? మొహమాటపడకుండా చెప్పు! నువ్వు మోయలేకపోతే ఎగిరిపోతాను’’ అని మిడిసిపడుతూ అంది తేనెటీగ. ఎద్దు దానిని పట్టించుకోకుండానే గడ్డి మేయడంలో మునిగిపోయింది. ఇంతలో బలంగా సుడిగాలి వచ్చింది. ఆ గాలికి తేనెటీగ కొమ్ముపై నిలవలేకపోయింది. గాలి ధాటికి ఎక్కడికో కొట్టుకు పోయింది. చివరకు ఒక కొమ్మకు చిక్కుకుని ప్రాణాలు కాపాడుకుంది. ‘బతుకు జీవుడా’ అంటూ తిరిగి చెట్టు కొమ్మ మీదకు చేరింది. అంతకు ముందు ఎద్దు ఎక్కడ నిలబడి ఉందో అక్కడే గడ్డి మేస్తూ కనిపించింది. అప్పుడు తేనెటీగకు తన శక్తి ఏ పాటిదో అర్థం అయింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!