రాహుల్ పై భగ్గుమన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2021-01-30T03:37:49+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. దేశ ప్రజలపై రాహుల్

రాహుల్ పై భగ్గుమన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. దేశ ప్రజలపై రాహుల్ యుద్ధాన్ని ప్రకటించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘దేశ ప్రజలపై రాహుల్ గాంధీ నేడు యుద్ధం ప్రకటించారు. తమ రాజకీయ దృక్పథానికి ప్రధాని మోదీ మద్దతివ్వకుంటే నగరాలకు నగరాలు అట్టుడుకుతాయని హెచ్చరించారు. హింసకు రాహుల్ పిలుపునిచ్చారు. నిరంతరం శాంతితో మెలిగేలా చూడాలని ప్రతి భారతీయ పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.’’ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సం రోజు సంభవించిన ఘర్షణలే ప్రతి నగరంలో, వాడలో ప్రతిబింబిస్తాయని రాహుల్ అన్నారని, దేశ చరిత్రలోనే శాంతికి బదులు హింసకు పిలుపునివ్వడం ఇదే ప్రథమమని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. 

Read more