ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా

ABN, First Publish Date - 2021-03-13T19:39:25+05:30

బీజేపీ మాజీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో యశ్వంత్ సిన్హా కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీ నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలకత్తా: బీజేపీ మాజీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో యశ్వంత్ సిన్హా కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీ నుంచి సిన్హా వైదొలిగారు. ఆ తరువాత ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ క్రమంలోనే తాజాగా శనివారం ఆయన టీఎంసీలో చేరారు. కలకత్తాలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీఎంసీ నేతలు డెరెక్ ఓబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ, సుభ్రతా ముఖర్జీల సమక్షంలో యశ్వంత్ సిన్హా టీఎంసీ కండువా కప్పుకున్నారు. బెంగాల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టీఎంసీలో చేరడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ‘ప్రజాస్వామ్యం బలం ప్రజాస్వామ్య వ్యవస్థలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ శక్తిని కోల్పోతున్నాయ’ని సిర్హా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీలో చేరడానికి ముందు ఆయన పార్టీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!