ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రక్తపోటు అదుపులో ఉండాలంటే..

ABN, First Publish Date - 2021-03-13T18:22:51+05:30

అవిసె గింజల్లోని సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్స్‌ మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడతాయి. అవిసె గింజల్లోని లిగ్నాన్స్‌, ఫైటో ఈస్ట్రోజెన్స్‌ కూడా గుండె, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగ పడతాయి. అవిసె గింజల్లో అధికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(13-03-2021)

ప్రశ్న: అవిసె గింజల పోషక విలువ లేమిటి?


- షమీమ్‌, అనంతపురం


డాక్టర్ సమాధానం: అవిసె గింజల్లోని సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్స్‌ మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడతాయి. అవిసె గింజల్లోని లిగ్నాన్స్‌, ఫైటో ఈస్ట్రోజెన్స్‌ కూడా గుండె, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగ పడతాయి. అవిసె గింజల్లో అధికంగా ఉండే విటమిన్‌- ఇ మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అవిసె గింజల నుంచి తీసే నూనెను ఫ్లాక్స్‌ ఆయిల్‌ అంటారు. దీనిలో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు శరీరానికి చాలా ఉపయోగం. అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యంగా పని చేయడానికి, మధుమేహం, కీళ్లనొప్పులను కొంత వరకు అదుపులో ఉంచడానికి ఈ ఫ్లాక్స్‌ ఆయిల్‌ వాడుకోవచ్చు. అవిసె నూనెను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చెయ్యకూడదు కాబట్టి నూనెను సలాడ్లలో కానీ, విడిగా కానీ తీసుకోవడం మంచిది. కూరలు వండేశాక ఆహారపదార్థాలపై అవిసె గింజల పొడిని చల్లుకోవచ్చు. అవిసె గింజల పొడిని, నూనెనూ రొట్టెల పిండిలో కలిపి చపాతీ కూడా చేసుకోవచ్చు. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!