ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిలిచిన మట్టి తవ్వకాలు

ABN, First Publish Date - 2021-02-21T05:50:27+05:30

పొట్టిలంక గ్రామ పరిధిలోని లంకభూముల్లో మట్టి త్రవ్వకాల నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి తవ్వకాలు నిలిపివేయాల్సిందిగా రాజమహేంద్రవరం మైన్స్‌ ఏడీ కడియం తహశీల్దారుకు ఉత్తర్వులు పంపారు.

కొలతలు కొలుస్తున్న మైన్స్‌, రెవెన్యూ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • లంక భూముల్లో విచారణ చేపట్టిన అధికారులు

కడియం, ఫిబ్రవరి 20: పొట్టిలంక గ్రామ పరిధిలోని లంకభూముల్లో మట్టి త్రవ్వకాల నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి తవ్వకాలు నిలిపివేయాల్సిందిగా రాజమహేంద్రవరం మైన్స్‌ ఏడీ కడియం తహశీల్దారుకు ఉత్తర్వులు పంపారు. దీంతో రెవెన్యూ అధికారులు తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించి యంత్రాలు నిలిపివేశారు. కాగా శనివారం రాజమహేంద్రవరం మైన్స్‌ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా స. నెం 147లో కొలతలు వేసి తవ్వకాలను అంచనా వేశారు. ఈ ప్రాంతాన్ని నదీగర్భంగా ఇరిగేషన్‌ అధికారులు నిర్ధారించినట్టు అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ శ్రీనివాసరావు తెలిపారు. అనుమతులకు మించి మట్టిని తవ్వినట్టు గుర్తించామన్నారు.


  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి


మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కడియపులంక సర్పంచ్‌ మార్గాని అమ్మాణిఏడుకొండలు, మాజీ సర్పంచ్‌లు పుల్లా రామారావు, గట్టి నర్సయ్య అధికారులను కోరారు. వివాదాస్పద భూమిలో తవ్వకాలకు అనుమతులెలా ఇచ్చారని నిలదీశారు. ఈ భూములపై కోట్లలో బ్యాంకు రుణాలు తెచ్చి డిఫాల్టర్లుగా మారారని, ఈ విషయం సీబీఐ కోర్టులో ఉందని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!