వేతన బకాయిలు చెల్లించండి

ABN , First Publish Date - 2021-03-14T05:33:07+05:30 IST

తమ వేతనబకాయిలు చెల్లించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రి పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. శనివారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి ధర్నా చేశారు.

వేతన బకాయిలు చెల్లించండి

  • రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 13: తమ వేతనబకాయిలు చెల్లించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రి పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. శనివారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి ధర్నా చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. బకాయిలు చెల్లిస్తేనే కానీ ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేయడంతో జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్‌ రమేష్‌కిషోర్‌ జోక్యం చేసుకుని పదిరోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మాటివ్వడంతో ఆందోళన విరమించారు. వీరి ఆందోళనకు దళిత నాయకుడు భానుచందర్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ వేతన బకాయిలు కోసం కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నా కాంట్రాక్టు ఏజెన్సీ స్పందిచడంలేదని ఆరోపించారు. జీతాలు కోసం అడిగిన వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. బకాయిలు కోసం అడిగితే సంబంధిత ఏజెన్సీ ప్రతినిధి సురేంద్ర నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంటి అద్దెలు కట్టడానికి నూటికి రూ.10 వడ్డీకి అప్పులు తెచ్చి కడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. 

Read more