Home » LATEST NEWS
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవం తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చారు.
అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.
పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా..
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారుతోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 42 డిగ్రీలు దాటేశాయి.
ఏపీలో పేదలు పండుగ చేసుకుంటున్నారు. సొంతింటి కల సాకారమైందంటూ సంబరాలు చేసుకున్నారు. టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు చేసుకుని, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
తిరుపతి జిల్లా పుడూరులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటూ మరో లక్షా యాభైవేల గృహాలను లబ్ధాదారులకు అందించనున్నారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లను సీఎం పరిశీలించారు.
ఏపీలోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోమవారం నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు.
విశాఖ గాజువాక ఎల్‌వీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాప్ట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు క్రిస్టియన్ శ్మశానవాటిక పనులు పరిశీలించారు మంత్రి.
టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూడండి..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్‌ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియలో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.