ఈ రోజుల్లో చాలా మందిలో థైరాయిడ్ సమస్య ఉంది. భారత్‌లో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
కొన్ని సూపర్ ఫుడ్స్ థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి హైపో, హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
పురుషుల్లో కంటే స్త్రీలలో ఈ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంది.
థైరాయిడ్ కారణంగా.. బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
రాతి ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువగా.. దానిమ్మలో కంటే 17 ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. థైరాయిడ్ అతిగా పనిచేస్తుంటే.. ఆ హార్మోన్ల ఉత్పత్తిని ఈ ఉసిరి నియంత్రిస్తుంది. ఉసిరి కాయను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.
థైరాయిడ్ గ్రంధి పనితీరుకు అవసరమైన సూక్ష్మపోషకం సెలీనియం. T4నిT3గా మార్చడానికి సెలీనియం అవసరం.
బ్రెజిలియన్ నట్‌లో సెలీనియం ఉంటుంది. రోజుకు ఒకటి తీసుకుంటే ఈ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది.
పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు ఉత్తమ ఆహారం. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరాయిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి.
పెసర్లలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెసర్లలో అయోడిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది.