రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటున్నారు.

పిచ్కారీలతో నీళ్లు చల్లుకుంటూ, గులాల్ పూసుకుంటూ డ్యాన్స్‌లు, కేరింతలతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రినుంచే మొదలయ్యాయి. 

మంగళవారం ఉదయం నుంచే జనం రంగుల్లో మునిగి తేలుతున్నారు

చిన్నారులు, యువత, మహిళలు హోలీని ఉత్సాహంగా ఆడుతూ ఆనందంగా పండుగను చేసుకుంటున్నారు.

యువతి, యువకులు సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ పండుగను మరింత రంగుల మయం చేశారు.

మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు.

ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, హర్షధ్వానాలు చేస్తూ పిల్లలు ఉల్లాసంగా గడుపుతున్నారు.