ఎర్ర ద్రాక్షలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్ చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి బ్లడ్ క్లాట్స్‌ ముప్పును తొలగిస్తాయి

వీటిల్లోని పాలీఫినాల్స్, రెస్‌వెరెట్రాల్ మెదడులోని న్యూరాన్‌లను కాపాడతాయి. 

ఎర్ర ద్రాక్షలోని విటమిన్ సీ, కే, ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 

ఇక ఆంథోసయానిన్స్, క్వెర్సటిన్‌లు క్యాన్సర్ ముప్పును  తగ్గిస్తాయి. 

వీటిల్లోని ల్యూటీన్, జియాజాంతీన్ అనే కాంపౌండ్స్ కంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి

ఎర్ర ద్రాక్ష గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు.

వీటితో చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడి వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి.