నిత్యం మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వాడే వారిలో అకాల వృద్ధాప్య లక్షణాలు వస్తాయి

వీటి నుంచి వెలువడే నీలి కాంతి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

ముఖంపై పడే నీలి కాంతితో చర్మం ముడతలు పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

కొందరిలో చర్మం నల్లబడుతుంది. నల్లటి మచ్చలు కూడా ఏర్పడతాయి

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి ముఖంలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువ అవుతాయి

కంటిపై కూడా ఒత్తిడి పెరిగి కళ్లు ఉబ్బినట్టు అనిపిస్తాయి

నీలి కాంతి కారణంగా చర్మంలోని తేమ శాతం తగ్గి అందవిహీనంగా మారుతుంది

దీనికి తోడు ఎండ కూడా తోడైతే వృద్ధాప్య ఛాయలు మరింత ఎక్కువ అవుతాయి