జామకాయ జ్యూస్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 

ఈ జ్యూస్‌లోని పీచు పదార్థం పేగుల కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఇందులోని పొటాషియం బీపీని అదుపులో పెడుతుంది. చెడు కొలెస్టెరాల్‌ను తగ్గిస్తుంది

జామకాయ జ్యూస్‌కు ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. దీన్ని తాగాక చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు

ఈ జ్యూస్‌లోని విటమిన్ సీ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఆరోగ్యవంతం అవుతుంది

జామకాయలోని విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌తో వృద్ధాప్య సంబంధింత కండరాల బలహీనత దరిచేరదు

ఇందులోని అధిక నీరు, పొటాషియం కండరాలు, నాడీ వ్యవస్థకు మేలు చేకూరుస్తాయి.