జీవితంలో ఒత్తిడి, ఆందోళన కలిగించే పరిస్థితులు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి

ఇలాంటి పరిస్థితుల్లో మనసు అదుపు తప్పకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి

ఒత్తిడి సమయాల్లో దీర్ఘశ్వాస తీసుకుంటే మనసు నెమ్మదించి సమస్యకు పరిష్కారం లభిస్తుంది

చిక్కుల్లో ఉన్నప్పుడు సానుకూల అంశాలపై దృష్టి పెడితే వెంటనే ఆందోళన తగ్గుతుంది

ఒత్తిడిలో క్షణికావేశానికి లోనుకాకుండా ఆలోచనలకు కాస్త విరామం ఇస్తే ఫలితం ఉంటుంది

ఆందోళన ఎక్కువైనప్పుడు నడిచినా, చేతులు, కాళ్లను స్ట్రెచ్ చేసిన రిలాక్స్ అవుతారు

లోటుపాట్లను మర్చిపోయి ఉన్న వాటిపై దృష్టిపెడితే మనసు అతిగా స్పందించడం తగ్గుతుంది

ఆధ్యాత్మికత అలవర్చుకుంటే ఒత్తిడికారక సమయాల్లో మనసు అదుపు తప్పదు