ఈ లక్షణాలు ఉంటే.. షుగర్ వచ్చినట్లే.. 

తరచుగా దాహంగా అనిపించడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం

విపరీతమైన అలసటగా అనిపించడం.. ముఖ్యంగా తిన్న తర్వాత..

కారణం లేకుండా బరువు తగ్గడం లేదా పెరగడం

కంటిచూపు మసకబారడం.. దృష్టి అస్పష్టంగా ఉండటం.

చర్మంపై మార్పులు.. మెడ, చంకలు, గజ్జల వద్ద చర్మం నల్లగా మారడం.

చిన్న గాయాలు, పుండ్లు మానడానికి అధిక సమయం పట్టడం.

చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, జలదరింపు వస్తుండడం.

తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.

ఈ లక్షణాలు ఎందుకు కనిపిస్తాయంటే.. శరీరంలో ఇన్సులిన్ సరిగా పని చేయనప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి.