మీరు ఉల్లిపాయల కోసం మార్కెట్ కు వెళ్తే కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఉల్లిపాయను కొనుగోలు చేసేటప్పుడు అవి గట్టిగా ఉన్నాయో లేదో చూడండి..

 దాన్ని చేత్తో నొక్కి.. చూడండి.. ఉల్లిపాయ మెత్తగా ఉంటే, అది లోపల కుళ్ళిపోవచ్చు లేదా త్వరగా చెడిపోవచ్చు. అలాంటి వాటిని కొనకండి.

ఉల్లిపాయ పైభాగంలో ఉన్న పచ్చి మొలకలు విరిగిపోకూడదు. విరిగిన ఉల్లిపాయలు లోపల బోలుగా ఉంటాయి. తక్కువ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మీరు కొనే ఉల్లిపాయపై నల్ల మచ్చలు లేదా బూజు ఉంటే వాటిని అస్సలు తీసుకోకండి. ఇలాంటి నల్ల మచ్చలు ఉంటే ఉల్లిపాయకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రారంభమైందని అర్థం.

కొన్ని ఉల్లిపాయల నుంచి ఎక్కువ స్మెల్‌ వస్తుంటుంది. అలాంటి వాటిని అస్సలు కొనకండి.

ఉల్లిపాయలు కొన్న తర్వాత వాటిని ప్లాస్టిక్ కవర్లలోనే ఉంచడం పెద్ద పొరపాటు. ఉల్లిపాయలను ఎప్పుడూ గాలి తగిలే బుట్టల్లో లేదా పొడి ప్రదేశంలో ఉంచాలి.

బంగాళదుంపలు, ఉల్లిపాయలు కలిపి ఉంచకూడదు. ఎందుకంటే బంగాళదుంపలు విడుదల చేసే వాయువుల వల్ల ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తుతాయి.