దానిమ్మ తొక్కలతో తెల్లజుట్టుకు చెక్ పెట్టేయండి..

జుట్టుకు రంగు వేసేందుకు రకరకాల హెయిర్ డైలు వాడుతుంతారు

కెమికల్స్ డైల వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది

దానిమ్మ తొక్కలతో తయారు చేసే డైతో తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టేయొచ్చు

జుట్టును బలోపేతం చేయడంతో పాటు సహజమైన నలుపు రంగును ఇస్తాయి

తయారీ విధానం: ఒక కప్పు ఎండిన దానిమ్మ తొక్కలు, 2 కప్పుల నీరు, 1 టీస్పూన్ టీ ఆకులు, 1 టీస్పూన్ ఆమ్లా పౌడర్, 1 టీస్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి

ఎండిన దానిమ్మ తొక్కలను రుబ్బుకుని, నీళ్లు పోసి మరిగించాలి

నీరు మరిగేటప్పుడు టీ ఆకులు, కాఫీ పొడి, ఆమ్లాపౌడర్ వేయాలి.. నీరు సగానికి అయ్యే వరకు మరగనివ్వాలి

ఈ హెయిర్‌ ప్యాక్‌ను జుట్టు మొత్తం అప్లై చేసి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేయాలి