ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఎలుకల సమస్య వదలట్లేదా. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి. ఇలా చేస్తే వాటంతట అవే పారిపోతాయి.   

అవి ఉండే చోట్ల ఎర్ర కారం పొడి చల్లండి లేదా నీటిలో కలిపి స్ప్రే తయారు చేసి ఎలుకలు వచ్చి వెళ్ళే ప్రదేశాలలో ఇంటి మూలల్లో స్ప్రే చేయండి.

కొంత కర్పూరం తీసుకొని ఇంటి మూలల్లో ఉంచండి లేదా నీటిలో వేసి పిచికారీ చేయండి. కర్పూరం పొగ ఇంట్లో వ్యాపింపచేయడం ద్వారా ఎలుకలను తరిమికొట్టవచ్చు.  

నిమ్మకాయ, నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎలుకల స్థావరాల వద్ద ఉంచండి. దెబ్బకు ఎలుకలు ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోతాయి.

ఇంట్లో ఎలుకలు సంచరించే ప్రదేశంలో 8-10 బే ఆకులను ఉంచితే సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు

ఎలుకలు పుదీనా, లవంగం వాసనను కూడా ఇష్టపడవు. కాబట్టి ఇవి ఎలుకలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఎలుకలు వెల్లుల్లి, నల్ల మిరియాలు వాసనను ఇష్టపడవు.వీటి ఘాటైన వాసన ఎలుకలను పారిపోయేలా చేస్తుంది.