ఉదయం రన్నింగ్ చేసొచ్చాక తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్స్ ఏవంటే..

రన్నింగ్‌తో అలసిన శరీరానికి అరటిలోని చక్కెరలు, విటమిన్స్‌తో తక్షణ శక్తి లభిస్తుంది.

చాక్లెట్ మిల్క్‌లోని ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు, ఎలక్ట్రోలైట్‌లతో శరీరం అలసట నుంచి తేరుకుంటుంది.

కోడి గుడ్లలోని ప్రొటీన్లతో కండరాలు కోలుకుని మరింత బలోపేతం అవుతాయి

గ్రీక్ యోగర్ట్‌లోని ప్రొటీన్లు, కాల్షియంతో కండరాలు, ఎముకలు మరింత దృఢంగా మారతాయి

ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి శరీరానికి స్వస్థత చేకూరుతుంది

సాల్మన్ చేపలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కండరాల బలోపేతానికి దోహదపడతాయి

చిలగడదుంపలోని యాంటీఆక్సిడెంట్స్‌‌తో కండరాలు కోలుకుంటాయి