నిల్వ పచ్చళ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో రోటి పచ్చళ్లు తినడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతోందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ పచ్చళ్లు.. మిక్సీ, గ్రైండర్లలో కాకుండా.. రోటిలో చేసుకుని తినడం వల్ల మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
ఈ రోటి పచ్చళ్లు.. టిఫిన్స్‌లోనే కాదు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
నిల్వ పచ్చళ్లతో పోలిస్తే.. రోటి పచ్చళ్లలో ఫైబర్, న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి.
భోజనంలో రోటి పచ్చళ్ల తీసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాలు, స్టెరాల్స్, ఫ్లేవనాయిడ్లు అలాగే ఉంటాయి. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
వీటిలోని ఫైబర్ కారణంగా.. జీర్ణవ్యవస్థ మెరుగుపడి.. రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దాంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. అంతేకాదు.. టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.
రోటి పచ్చళ్లలో విటమిన్లు డి, బి 12 ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వారు వీటిని తీసుకుంటే మంచిది.
ఈ పచ్చళ్లలో కార్డియో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. దాంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఈ పచ్చళ్లలో వేసే పదార్థాలు.. గుండెపై ప్రభావం చూపుతాయి. దాంతో తక్కువ ఉప్పు, హెల్దీ ఆయిల్ వాడాలి, మసాలాలు అసలు వాడొద్దు.
ఈ పచ్చళ్లు ప్రోబయోటిక్ అందిస్తాయి. వీటిని తీసుకుంటే గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దాంతో పేగులో ఇబ్బందులు, మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తగ్గిస్తాయి.
ఈ పచ్చళ్లు తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర, కరివేపాకును ఉపయోగించి వీటిని తయారు చేసుకుంటే మంచిది.
వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు రోటి పచ్చళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.