హైబీపీని తగ్గించే పచ్చళ్లు..
పచ్చళ్లు తింటే బీపీ (అధిక రక్తపోటు) పెరుగుతుందంటారు.
కానీ బీపీ నియంత్రణలో ఉండాలంటే ఉప్పు తక్కువగా ఉండే.. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండే పచ్చళ్లు ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆమ్లా (ఉసిరి) లేదా పాలకూర వంటి ఆకుకూరలతో ఇంట్లోనే పచ్చళ్లు తయారు చేసుకోవచ్చు.
చాలా తక్కువ నూనె, ఉప్పు వినియోగించి వీటిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్తమీర/ పుదీనా పచ్చడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
కరివేపాకు పచ్చడిలోని పోషకాలు రక్త నాళాలను రిలాక్స్ చేస్తాయి.
ఉసిరి పచ్చడిలో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఉంటాయి.
పాలకూర పచ్చడిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
ఈ పచ్చళ్ల తయారీలో స్వల్పంగా ఉప్పు, కారంతోపాటు నూనె వినియోగించేలా తప్పక జాగ్రత్తలు పాటించాలి.
ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్లు (Instant Chutneys) ఉత్తమం.
పచ్చళ్లలో ఉప్పు (సోడియం) శాతం 1500 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
బీపీ ఉంటే.. పోషకాహారంతోపాటు తగినంత వ్యాయామం చేయాలి.
ఒత్తిడి లేని జీవన శైలి.. బీపీని దూరంగా ఉంచుతాయి.
Related Web Stories
ఈ పండ్లు తింటే వెలకట్టలేని బెనిఫిట్స్
హిందూ మహాసముద్రం.. ఆసక్తికర విషయాలు
నిత్యం మొబైల్ వాడితే వృద్ధాప్య లక్షణాలు
టూత్ పేస్టు ఎలా పనిచేస్తుందో తెలుసా?