ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం వల్ల వ్యక్తిగత అందం, ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు.
వీటిని ధరించడం వల్ల.. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు.
సాధారణంగా దుస్తులు ఉతికిన తర్వాత ఇస్త్రీ చేయడం వల్ల వాటిలో మిగిలి ఉండే తేమ తగ్గడంతోపాటు కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి.
ఇస్త్రీ చేసే సమయంలో ఉత్పత్తి అయ్యే అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇస్త్రీ కారణంగా.. దుస్తులు పొడిగా, సౌకర్యవంతంగా ఉంటాయి. మనలో వ్యక్తిగత ఆత్మవిశ్వాసం పెరగడంలో ఇది సహాయపడుతుంది.
ముఖ్యంగా వర్షాకాలం లేదా తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో దుస్తులు ఆరబెట్టడం వల్ల సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇస్త్రీ చేయడం అదనపు రక్షణగా ఉంటుంది.
ఇస్త్రీ చేసిన దుస్తులు పొడిగా, మృదువుగా ఉంటాయి. వాటి వల్ల చర్మంపై రాపిడి కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం వల్ల పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది.
కార్యాలయాలు, విద్యాసంస్థలు, అధికారిక సమావేశాల్లో ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం వల్ల మన పట్ల ఇతరుల్లో సానుకూల ముద్ర వేస్తాయి.