మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి దారి తీయొచ్చు.
తేమ, చల్లని వాతావరణం కారణంగా మొలకల్లో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ సీజన్‌లో మొలకలను నేరుగా తినడం కంటే.. ఉడికించి తీసుకోవడం సురక్షితం.
మొలకలను తినే ముందు శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేయొద్దు.. తయారైన 1–2 రోజుల్లోనే వినియోగించాలి.
చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి మొలకలకు దూరంగా ఉండాలి.
బయట కొనుగోలు చేసే వాటికంటే.. పరిశుభ్రంగా ఇంట్లో తయారు చేసిన మొలకలు తింటే మేలు.
మొలకలు తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు, జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మొలకలు పోషకాల ఖజానా అయినప్పటికీ.. వర్షాకాలంలో పరిశుభ్రత, ఉడికించి తీసుకోవడం మంచిది.
Related Web Stories
వీటితో థైరాయిడ్‌కు చెక్..
విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాసనాలు
సింపుల్ చిట్కా: ఎముకల దృఢత్వానికి ఈ పొడి సూపర్