అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాన్ని చేపట్టింది.
విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించారు బాబా రామ్‌దేవ్.
యోగాంధ్ర లోగో ఉన్న షర్ట్ ధరించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
అనులోమ - విలోమ పద్ధతిలో సీఎం ప్రాణాయామం చేశారు.
ఈ వేదిక మీద వివిధ యోగాసనాలను బాబా రామ్‌దేవ్ శిష్యులు వేశారు.
వేంకటేశ్వరస్వామి సుప్రభాతం, గోవింద నామస్మరణతో సీఎం యోగా సాధన చేశారు.
యోగా దినోత్సవం సందర్భంగా సీఎం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు.
ప్రపంచానికి భారత్ విశ్వగురు అని సీఎం వ్యాఖ్యానించారు.
Related Web Stories
ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాసనాలు
సింపుల్ చిట్కా: ఎముకల దృఢత్వానికి ఈ పొడి సూపర్
యాలకుల పాలు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
వర్షాకాలానికి సిద్ధం అవ్వండి.. ఆరోగ్యంగా ఉండండి..