యాలకుల పాలు.. ఆరోగ్య ప్రయోజనాలు..?

ఆయుర్వేదంలో పాలతోపాటు యాలకులకు ప్రత్యేక స్థానం ఉంది. పాలలో ప్రధానంగా ప్రోటిన్, కాల్షియం, లాక్టోస్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. 

యాలకుల్లో ప్రత్యేక సువాసనతోపాటు ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

యాలకుల పాలు.. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి.

నోటి పూత వస్తే.. తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీని వల్ల ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో యాలకుల పాలు తీసుకుంటే నోటి పూత మాయం అవుతుంది.

యాలకులు యాంటీసెప్టిక్, ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.

యాలకుల పాలు తాగితే.. రక్తపోటును తగ్గుతుంది. ధమనుల గోడలను పల్చగా చేస్తాయి.

ఈ పాలలో ఉండే సహజ ఖనిజాలు, పీచుపదార్థం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్థాయి. దీనివల్ల జీర్ణక్రియ మరింత ప్రయోజనకరంగా మారుతుంది.

యాలకుల పాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ మూలకాలు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి.. నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

ఈ పాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఈ పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి క్యాన్సర్, క్షయ వరకు తీవ్ర వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది.  

ఒక ఏడాది పైబడిన పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారికి యాలకుల పాలు మంచి పానీయం.