వేసవి నుంచి వర్షాకాలం మారే సమయంలో ఆరోగ్య మార్పుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వాతావరణ మార్పుల కారణంగా జీర్ణ సమస్యలు, జలుబు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.
కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కాచి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి. బయట దొరికే స్ట్రీట్ ఫుడ్, కట్ చేసిన పండ్లు, ఐస్ వాటర్‌ను పూర్తిగా నివారించడం ఉత్తమం.
వర్షంలో తడవకుండా ఉండటం మంచిది. ఒకవేళ తడిస్తే.. వెంటనే వేడి నీటితో స్నానం చేయాలి.
పరిసరాలతో పాటూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమతెరలు వాడటం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.
విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు, వేడి సూప్ లు, పసుపు పాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ చిన్నచిన్న జాగ్రత్తలతో వర్షాకాలాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చు.
Related Web Stories
పచ్చి మామిడికాయ తింటే ఇన్ని లాభాలా..
ఈ చిటికెడు పొడితో షుగర్ కంట్రోల్..
కాఫీ తాగడం వల్ల బెస్ట్ ప్రయోజనాలు ఇవే..
షుగర్ తగ్గించే సూపర్ చిట్కా.. పైసలతో అసలు పని లేదు!