షుగర్ తగ్గించే సూపర్ చిట్కా.. పైసలతో అసలు పని లేదు!

ప్రస్తుతం షుగర్ సమస్య అందరిని ఇబ్బంది పెడుతుంది. దీనిని తగ్గించుకునేందుకు మార్కెట్‌లో అనేక ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. 

కానీ ప్రకృతి పరంగా సహజంగా దొరికే పదార్థాలతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అందులో ఒకటి వేప పూవ్వు.

దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

వేప పువ్వు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, పేగు పురుగుల సమస్యలను నియంత్రిస్తుంది. 

రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దేహంలో మలినాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మన్ని సంరక్షిస్తుంది. మొటిమలు, మచ్చలు, దురద వంటి చర్మ సమస్యలను తగ్గించి.. మొటిమలు ఉన్న చర్మాన్ని శుభ్రపరుస్తుంది. 

ఈ పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వేప వువ్వులను నీటిలో మరిగించి, ఆవిరిపట్టడం ద్వారా తలనొప్పి, చెవినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేప పువ్వును మితంగా వాడాలి. అధిక మోతాదులో తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగే అవకాశం ఉంది.